పెంపుడు జంతువులతో రిలీఫ్!
'కిక్' సక్సెస్ తో గాలిలో తేలిపోతున్న ఇలియానా కొద్ది సమయం తీసుకుని గోవాలోని తన కుటుంబ సభ్యులు, ఎంతో ఇష్టపడే పెంపుడు జంతువుల మధ్య సొంతింట్లో రిలీఫ్ అవుతోంది. తన తల్లిదండ్రుల పెళ్లిరోజును దగ్గరుండి సెలబ్రేట్ చేసిన ఇలియానా తాను 'ఇంటి పక్షి'నని చెప్పుకొచ్చింది. 'పార్టీలకూ పబ్ లకూ తిరగడం నాకు ఇష్టముండదు. నేను ఇంటిపక్షిని. కొద్ది నెలల క్రితమే మేము గేవాలో ఇల్లు తీసుకున్నాం. అయితే ఇంటిని డెకరేట్ చేసే అవకాశం మాత్రం ఇప్పుడే చిక్కింది. ఇప్పుడు మా ఇల్లెంత ముద్దుగా ఉందో?' అంటూ సంబరం వ్యక్తం చేస్తోంది ఇలియానా.
సొంతిల్లు స్వర్గధామం కదా? అందులో నీకు నచ్చిన ప్లేస్ ఏదని అడిగితే...స్మిమ్మింగ్ ఫూల్ అంటూ తడుముకోకుండా సమాధానమిచ్చింది. తన ఇంట్లో ఏడు పెంపుడు పిల్లులు, రెండు కుక్కలు ఉన్నాయనీ, వాటితో ఆడుకోవడం ద్వారా పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందుతుతున్నాననీ చెప్పుకొచ్చింది. అందిరి ఇళ్లలోనూ అక్కాచెల్లెలు సరదాగా గొడవపడుతుంటారనీ, తాను కూడా తన 13 ఏళ్ల సోదరితో ఫైట్ చేస్తుంటాననీ చిలిపిగా చెప్పింది. ఫిట్ నెస్ కోసం జిమ్ కు వెళ్లడం, యోగా చేయడం చేయనీ, బ్రిస్క్ వాక్ (వేగంగా నడవడం) చేయడం వల్ల తన ఆహార్యాన్ని ఫిట్ నెస్ తో ఉంచుకుంటున్నాననీ తెలిపింది. ఇటీవల షూటింగ్ ల పేరుతో యూరప్, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్ లకు నాన్ స్టాప్ జర్నీ చేయడంపై ముచ్చటిస్తూ..ఆల్ప్స్ లో 8 డిగ్రీల సెల్సియస్ నుంచి మలేసియాలో 40 డిగ్రీల సెల్సియస్ వరకూ అన్నిరకాల వాతావరణాలనూ చవిచూశాననీ, అయితే వృత్తిరీత్యా ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదని పేర్కొంది. కామిక్ జనర్ లో తనకంటూ ప్రత్యేకత ఉన్న రవితేజతో 'కిక్'లో పోటీపడి నటించడం తనకెంతో తృప్తి నిచ్చిందనీ, ఇతర టాప్ స్టార్స్ తో నటించేందుకు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాననీ చెప్పుకొచ్చింది. అయితే తన పాత్రకు మాత్రం ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేసింది. 'సుల్తాన్' చిత్రంలో స్టార్ హీరో రజనీకాంత్ తో నటించే అవకాశం కోల్పోవడంపై వ్యాఖ్యానిస్తూ...అందుకు విచారం లేదనీ, తనకు ఏది దక్కాలని రాసి పెట్టుందో అదే దక్కుతుందని ఎప్పుడూ బలంగా నమ్ముతానంటూ కూసింత వేదాంత ధోరణి కూడా ప్రదర్శించింది.
Be first to comment on this News / Article!
|