బ్యాంకాక్ కు 'వరుడు'
ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'వరుడు' చిత్రం మరో కీలక షెడ్యూల్ కు సన్నద్ధమవుతోంది. కనకరత్న మూవీస్ బ్యానర్ పై ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ కు జోడిగా అనుష్క నటిస్తోంది. ఇటీవల హైద్రాబాద్ లోని ఓ భారీ సెట్ లో మహేష్, అనుష్క జంటపై ఓ స్సైసీ బెడ్రూమ్ సాంగ్, మరికొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తాజా షెడ్యూల్ ఈనెల 29 నుంచి బ్యాంకాక్ లో జరిపేందుకు చిత్ర యూనిట్ బయలుదేరి వెళ్తోంది.
మహేష్ ఇందులో టాక్సీ డ్రైవర్ గా నటించబోతున్నారనీ, యాక్షన్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారనీ యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ఆలి, నాజర్, ఎమ్మెస్ నరాయణ, ధర్మవరపు, తనికెళ్ల భరణి, షఫి, సునీల్ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కెమెరామన్ సునీల్ పటేల్ ('హమ్ తుమ్', 'బచ్ నా ఏ హసీనో' ఫేమ్) ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|