నితిన్ తో లక్కీ హన్సిక
లవర్ బాయ్ ఇమేజ్ తో సక్సెస్ అయి ఇమేజ్ ఛేంజోవర్ కోసం యువ హీరోలు పడుతున్న కష్టం ఇంతా అంతా కాదు. తొలినాళ్లలో 'జయం', 'దిల్', 'సై' వంటి సక్సెస్ లు చవిచూసిన నితిన్ 'శ్రీ ఆంజనేయం' చిత్రం నుంచి ఫ్లాపుల్లోకి జారిపోయారు. ఓ ఏడాది పాటు నితిన్ నటించన సినిమా ఏదీ రిలీజ్ కాని పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో నటించిన 'టక్కరి', 'ఆటాడిస్తా', 'హీరో', 'విక్టరీ' చిత్రాలు నితిన్ కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'ద్రోణ' చిత్రం ఇదే బాట పట్టింది. అయితే ఒక్క హిట్ వస్తే మళ్లీ నితిన్ కు తిరుగులేదనే నిర్మాతలకు కొదవలేదు. అందుకు తగ్గట్టే వరుస అవకాశాలు కూడా నితిన్ ను వరిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరుచూరి మురళి దర్శకత్వంలో 'రెచ్చిపో', రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'అజ్ఞాత్' చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో నితిన్ కు జోడిగా ఇలియానా నటిస్తుండటం కూడా ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. తాజాగా నితిన్ తదుపరి చిత్రంలో 'గోల్డెన్ లెగ్' హన్సిక హీరోయిన్ గా ఎంపికైంది.
'దేశముదురు', 'కంత్రీ' వంటి హిట్స్ తర్వాత హన్సిక స్పెషల్ రోల్ పోషించిన 'బిల్లా' సైతం కమర్షియల్ సక్సెస్ కావడంతో హన్సిక లక్కీహీరోగా ముద్రపడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ కు జోడిగా హన్సిక నటిస్తోంది. దీనికితోడు ఇప్పుడు నితిన్ హీరోగా ఈశ్వర్ రెడ్డి ('సిద్ధూ ఫ్రమ్ సికాకుళం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రానికి కూడా హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 'సిద్దూ ఫ్రమ్ సికాకుళం' చిత్రాన్ని అందించిన ఎం.విజయప్రసాద్ నిర్మించనున్నారు. జూన్ 15 నుంచి ఈ కొత్తచిత్రం షూటింగ్ మొదలవుతుంది.
Be first to comment on this News / Article!
|