గోదావరి తీరంలో 'చల్ చల్'
అనీష్, కీర్తి జంటగా వర్మ ఎస్.ఇపూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం 'చల్ చల్'. దీనికి 'లెట్స్ గో' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ చిత్రం నిర్విరామంగా గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది.
తొలిసారిగా చిత్ర విశేషాలను దర్శకుడు వర్మ తెలియజేస్తూ, కుటుంబ సమేతంగా చూడదగని చక్కటి ప్రేమకథా ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. కామెడీకి ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని వెదుర్లంక, పిల్లంక పరిసర ప్రాంతాల్లో 23 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, దీంతో 70 శాతం షూటింగ్ పూర్తయిందనీ చెప్పారు. జూన్ 10 నుంచి హైదాబాద్ లో రెండో షెడ్యూల్ జరుతామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో భానుచందర్, ఎం.ఎస్.నారాయణ, హర్షవర్దన్, జోగినాయుడు, విజయ రంగరాజా మాస్టర్ భరత్ , ద్రాక్షారామం సరోజ, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి వనమాలి పాటలు, నాగ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, వినూ థామస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|