హీరోగా నవదీప్ సోదరుడు
పరిశ్రమకు పరిచయం కావడానికి సినీ నేపథ్యం ఉండటం ఒక అర్హతగా చెప్పుకోవచ్చు. గుర్తింపు పొందిన నటీనటుల ఫ్యామిలీస్ నుంచి పలువురు హీరో హీరోయిన్లుగా పరిచయం కావడం కూడా కొత్త కాదు. హీరో నవదీప్ సోదరుడు ప్రభు కూడా ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. వీరు ద్వైత్ దర్శకత్వంలో వి.రవికుమార్ శ్రీ చిత్ర బ్యానర్ పై రూపొందించనున్న 'గుడు గుడు గుంజం' చిత్రానికి కథానాయకుడిగా ప్రభు ఎంపికయ్యారు.
'ఆరోప్రాణం', '2 మచ్', 'ఎక్స్ ట్రా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరు కె ఇప్పుడు వీరు ద్వైత్ పేరుతో ఈ తాజా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆర్.పి.పట్నాయక్ స్టూడియోస్ లో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే కథాంశంతో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనునట్టు వీరూ చెబుతున్నారు. ఈనెల 29న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. 60 శాతం షూటింగ్ బ్యాంకాక్, పుకెట్ లో ప్లానే చేస్తున్నారు. జూలై 31కి తొలికాపీ రెడీ అవుతుంది.
Be first to comment on this News / Article!
|