కాలేజీ కథతో అరుణై పిక్చర్స్
అవితేజ్, తిరు, వైనవి, పార్వతి హీరోహీరోయిన్లుగా అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. బి.ఆర్.వర్మ దర్శకత్వంలో ఇ.వి.కుమరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం విశేషాలను తొలిసారి హైద్రాబాద్ లోని రామానాయుడు సినీ విలేజ్ లో సినీ యూనిట్ మంగళవారం తెలియజేసింది.
శ్యామ్, బి.జయ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన తనకు ఇది దర్శకుడిగా తొలిచిత్రమని, ఇంకా టైటిల్ ఖరారు చేయాల్సి ఉందనీ వర్మ తెలిపారు. కాలేజీ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందనీ, అందుకు తగ్గట్టే ఈ చిత్రం ద్వారా ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లను కొత్తగా పరిచయం చేస్తున్నామనీ చెప్పారు. ద్విభాషా చిత్రంగా ఈ సినిమా చేస్తున్నామనీ, కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు. జూలై 10వ తేదీకి తొలికాపీ సిద్ధం చేస్తామని అన్నారు. ఇందులో మన్మథరాజా అనే ఓ పాత్రను పోషిస్తున్న్టటు నటుడు సునీల్ తెలిపారు. తమిళంలో ఈ పాత్రను వివేక్ చేస్తున్నాడని అన్నారు. దర్శకుడు వర్మ తనకు మంచి మిత్రుడనీ, ఆయన తొలి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బెనర్జీ, సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. వర్మ కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి స్వర్ణ సుధాకర్ మాటలు, భువనచంద్ర పాటలు, ఆకాష్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ, విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|