హ్యాట్రిక్ బాటలో వరుణ్
కొత్తగా వెండితెరకు పరిచయమయ్యే హీరోలకు తొలి హిట్ దక్కితే నిర్మాతలు క్యూలు కట్టేస్తుంటారు. తొలి చిత్రం 'హ్యాపీడేస్'తో ప్రేక్షకులకు పరిచయమైన వరుణ్ సందేష్ ఆ చిత్రం సాధించిన సక్సెస్ తో యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. హీరో సిద్దార్ధ పోలికలు అతనిలో ఉండటం కూడా కలిసొచ్చే అంశమైంది. వరుణ్ ద్వితీయ చిత్రంగా దిల్ రాజు నిర్మించిన 'కొత్త బంగారులోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ ను ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నటించిన 'ఎవరైనా ఎపుడైనా' (ప్రేమలో పడొచ్చు) చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరేందుకు రెడీ అవుతోంది. కొద్ది విరామం తర్వాత ప్రతిష్ఠాత్మక ఏవియం సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు మార్తాండ్ శంకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కాలేజీ చదువు పూర్తి చేసుకున్న వరుణ్ సందేష్, కళాశాల విద్యార్థిని విమలారామన్ మధ్య నడిచే సున్నితమైన ప్రేమ కథా ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. వరుణ్ తొలి రెండు చిత్రాల విజయంలో సంగీతానికి ప్రాధాన్యం ఉన్నట్టే ఈ చిత్రానికి కూడా మణిశర్మ యూత్ ఫుల్ ట్యూన్స్ ఇచ్చారనీ, మ్యూజికల్ హిట్ ఖాయమనీ నిర్మాతలు చెబుతున్నారు. జూన్ 1న ఈ చిత్రం పాటలు విడుదల కానున్నాయి. పాటలు హిట్టయితే సగం సినిమా హిట్టనే సెంటిమెంట్ వరుణ్ కు మరోసారి కలిసొస్తుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|