ఆసిన్ పేరులో నేముంది?
పేరులో ఏముంది పెన్నది..అంటూ కొందరు పేరు మార్పుకో, సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో కొత్త లెటర్సు చేర్చుకోవడమో జరుగుతుంది. గ్లామర్ వరల్డ్ ను నమ్ముకుని ఓ వెలుగు వెలగాలనుకునే నటీనటులు ఇందుకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే 'నేమ్ అండ్ ఫేమ్' తెచ్చుకునేందుకు మరికొందరు స్టార్స్ ఇష్టపడుతుంటారు. కేరళలో పుట్టి తమిళంలో ఓ వెలుగు వెలిగి, తెలుగు ప్రేక్షకులను కూడా మురిపించిన ఆసిన్ ఇదే కోవలోకి వస్తుంది. హిందీ 'గజనీ' సాధించిన సక్సెస్ తో ఇప్పుడు అక్కడ కూడా ఆమె పేరు మారుమోగిపోతోంది. ఇదంతా తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మహత్యమేనని ఆసిన్ సంబరపడుతోంది. ఆసిన్ అనేది స్క్రీన్ నేమ్ కాదనీ, తన సొంతపేరనీ ఆమె తాజాగా వివరణ ఇచ్చింది.
ఆసిన్ అంటే పాపానికి తావులేదని అర్ధమనీ, ఆంగ్లం, సంస్కృత భాషల కలయికతో తనకు తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారనీ ఆమె తెలిపింది. ఎంతో క్రియేటివిటీతో ఇలాంటి అసాధారణమైన పేరు పెట్టిన క్రెడిట్ తన తల్లిదండ్రులకే తక్కుతుందని చెప్పుకొచ్చింది. తమిళంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆసిన్ ఇప్పుడు 'లండన్ డ్రీమ్స్ 'లో సల్మాన్ ఖాన్ తోనూ, '19 స్టెప్స్'లో కమల్ హాసన్ తోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో తన 'పేరు' హాలీవుడ్ కూ కూడా రీచ్ అవుతోందని ఆసిన్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Be first to comment on this News / Article!
|