యువరత్న బాలకృష్ణ కథానాయకుడిగా యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించనున్న తాజా చిత్రానికి దర్శకుడిగా బోయపాటి శ్రీను వచ్చి చేశారు. మొదట్నించీ ఈ చిత్రానికి బి.గోపాల్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ చివరకు బోయపాటి శ్రీను ఈ అవకాశం దక్కించుకున్నట్టు తెలిసింది.
బోయపాటి శ్రీనివాస్ ఇంతవరకూ రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. రవితేజతో 'భద్ర', వెంకటేష్ తో 'తులసి' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే రెండు హిట్ల తర్వాత కూడా ఆయన కెరీర్ వేగం పుంజుకోకపోవడం విశేషం. నాగార్జునతో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న కొత్త చిత్రానికి తొలుత బోయపాటి పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. అంతకుముందు గోపీచంద్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగినా అది కూడా ఆచరణకు నోచుకోలేదు. రెండు అవకాశాలు జారిపోయిన తర్వాత బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం అందిపుచ్చుకోవడం ద్వారా బోయపాటి తన సత్తా మరోసారి నిరూపించుకునేందుకు రెడీ అవుతాయి. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వస్తుంది. బాలకృష్ణకు జోడిగా నయనతార తొలిసారి నటించనుంది.