'చెట్టుకింద పెళ్లికొడుకు'
పరమేష్ ('నా మనసుకేమయింది' ఫేమ్), సోనియా, నయన హీరోహీరోయిన్లుగా ఇన్నొవేటివ్ క్రియేషన్స్ పతాకంపై అత్నూరి ప్రభాకర్ నిర్మిస్తున్న చిత్రం 'చెట్టుకింద పెళ్లికొడుకు'. అరుణాచలం దర్శకుడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో బుధవారం ఉదయం ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. అత్నూరి ప్రభాకర్ సతీమణి ఉదయలక్ష్మి క్లాప్ ఇచ్చారు.
ప్రేమ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామనీ, దర్శకుడిగా ఇది తన తొలి చిత్రమనీ అరుణాచలం తెలిపారు. ఇందులో కథానాయకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనీ, అతనికి ఎలా పెళ్లయిందనేది టూకీగా ఈ చిత్ర ఇతివృత్తమనీ చెప్పారు. తమ సంస్థ తొలి చిత్రాన్ని చిన్న బడ్జెట్ తో తీస్తున్నట్టు నిర్మాత ప్రభాకర్ తెలిపారు. ఈరోజు నుంచి జూన్ 4 వరకూ తొలి షెడ్యూల్ జరుగుతుందని అన్నారు. 'నా మనసుకేమయింది' చిత్రం తర్వాత తాను ఇందులో నటిస్తున్నాననీ, చక్కటి ఎంటర్ టైనర్ గా చిత్రం ఉంటుందనీ పరమేష్ తెలిపారు. నటిగా తనకిది తొలి చిత్రమని నయన పేర్కొనగా, కన్నడంలో రెండు సినిమాలు చేసిన తనకు తెలుగులో మొదటి చిత్రమని నయన తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దువ్వాసి, శ్రీదర్, బొంబాయి పద్మ, అపూర్వ తదితరులు నటిస్తున్నారు. పూర్ణ చంద్ర సినిమాటోగ్రఫీ, రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|