'రాజు మహరాజు' ఆడియో
డాక్టర్ ఎం.మోహన్ బాబు ప్రధాన పాత్రలో శర్వానంద్ హీరోగా శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై కుమారస్వామి పత్తికొండ నిర్మించిన చిత్రం 'రాజు మహరాజు'. దుర్గా శంకర్ నాథ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తాజ్ డక్కన్ హోటల్ లో బుధవారం రాత్రి సందడిగా జరిగింది. ప్రముఖ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి జయసుధ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో సీడీని విడుదల చేశారు. తొలి ప్రతిని మంచు మనోజ్, హీరో శర్వానంద్ లకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను రాజమౌళి, ట్రైలర్స్ ను రామ్ విడుదల చేశారు. చిత్ర హీరోయిన్లు తశు కౌషిక్, సుర్విన్ చావ్లాతో పాటు శర్వానంద్, నాని, తనిష్, తమ్మారెడ్డి భరద్ాజ, భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి, చంద్రసిద్దార్ధ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చక్రి సంగీతం అందించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
జయసుధ మాట్లాడుతూ, దర్శకుడు శంకర్ తీసిన 3 చిత్రాల్లో తాను నటించాననీ, సెంటిమెంట్ గా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించాననీ చెప్పారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు, తానూ క్లాస్ మేట్స్ మనీ, ట్రైలర్స్ బాగున్నాన్నాయనీ, సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని అనుకుంటున్నాననీ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, మోహన్ బాబు వంటి పెద్ద ఆర్టిస్ట్ తో శర్వానంద్ నటించడం విశేషమనీ, సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, కొత్త లైఫ్ కోసం పేరు మార్చుకుని ఈ సినిమా చేశానని చెప్పారు. నిర్మాత ఏది కావలంటే అది సమకూర్చారని, సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ నిర్మాతకే దక్కుతుందన్నారు. అలాగే ఫెయిల్యూర్స్ లో ఉన్న తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్న శర్వానంద్ కు కృజ్ఞతలనీ, మోహన్ బాబు వంటి గొప్ప నటుడితో పనిచేయడం తన అదృష్టమనీ అన్నారు. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నానని, సినిమా చాలా బాగా వచ్చిందనీ శర్వానంద్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో పనిచేసిన అందరికీ తన కృతజ్ఞతలని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనోజ్, తనీష్, నాని తదితరులు అభిలషించారు.
Be first to comment on this News / Article!
|