విశాల్ ఇక 'ప్లేబాయ్'
యాక్షన్ హీరో ఇమేజ్ తో 'పందెంకోడి', 'పొగరు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న విశాల్ ఈ శుక్రవారమే 'పిస్తా'గా తెలుగులోనూ, 'తోరణై' పేరుతో తమిళంలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ జి.కె.ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రం తర్వాత విశాల్ బయట బ్యానర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిని ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ సింగనమల రమేష్ ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు.
సింగనమల రమేష్ ఇప్పుడు రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. మహేష్ హీరోగా 'వరుడు' , పవన్ కల్యాణ్ తో 'కొమురం పులి'చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజా చిత్రంలో విశాల్ ప్లేబాయ్ తరహా పాత్రను పోషించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో విశాల్ కు జోడిగా శ్రియ, రీమా సేన్ నటించనున్నారు. రీమాసేన్-విశాల్ జంట ఇప్పటికే పాపులర్ కాగా, 'పిస్తా'లో విశాల్ సరసన శ్రియ నటించింది. తాజా చిత్రం ద్వారా తిరు అనే యువదర్శకుడు పరిచయం కాబోతున్నారు. జూన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ఎక్కువ భాగం షూటింగ్ హైద్రాబాద్ లోనే జరుగుతందనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|