'రైడ్' ట్రయిలర్స్ విడుదల
నాని, తనీష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బల్లంకొండ సురేష్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'రైడ్'. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్ ను రిలీజ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ 87వ జయంతిని పురస్కరించుకుని బెల్లంకొండ సురేష్ కేక్ కట్ చేశారు. నాని, తనీష్, హేమచంద్ర, రమేష్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈనెల 28న 'రైడ్' చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశామనీ, అయితే సినిమా ఓ వారం రోజుల వాయిదా పడి జూన్ 5న రిలీజ్ అవుతోందన్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు. చాలాకాలం తర్వాత తన బ్యానర్ లో చేస్తున్న చిత్రమిదనీ, అంతా కష్టపడి పనిచేసిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజునే ట్రయిలర్స్ విడుదల కావడం సంతోషంగా ఉందని నాని పేర్కొన్నారు. సినిమా సక్సెస్ పట్ల మంచి నమ్మకంతో ఉన్నట్టు తనిష్ అన్నారు. శుక్రవారం నుంచి 'రైడ్' థియేటర్ ట్రైలర్స్ ప్రదర్శిస్తారు.
Be first to comment on this News / Article!
|