'గుడు గుడు గుంజం' షురూ
పార్థు (నవదీప్ సోదరుడు), ఆర్తి హీరోహీరోయిన్లుగా శ్రీ చిత్ర పతాకంపై వి.రవికుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'గుడు గుడు గుంజం'. వీరు ద్వైత్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో శుక్రవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సీనియర్ నటుడు చలపతిరావు, హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తం సన్నివేశానికి శ్రీనువైట్ల క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే విష్ణుర్ధన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అచ్చిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
వీరు ద్వైత్ మాట్లాడుతూ, గతంలో తాను తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనీ, కథ నచ్చి నిర్మాత ఈ సినిమా తీసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. జూన్ 5 నుంచి 16 వరకూ బ్యాంకాక్ తొలి షెడ్యూల్ జరుపుతామనీ, జూలై 1 నుంచి హైద్రాబాద్ లో జరిగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుదనీ అన్నారు. ఆగస్టులో రిలీజ్ ఉంటుంన్నారు. పార్థు మాట్లాడుతూ, తానూ, నవదీప్ కజిన్స్ అవుతామనీ, అతనికంటే తాను రెండేళ్ల పెద్ద అనీ చెప్పారు. చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టపడే తాను ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతుండటం సంతోషంగా ఉందన్నారు. చలపతిరావు మాట్లాడుతూ, దర్శకుడు వీరు గట్స్ ఉన్న దర్శకుడనీ, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. మరో కథానాయిక ఎంపిక కావలసి ఉన్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు, కృష్ణ భగవాన్, కొండవలస, వేణుమాధవ్, భరణి, భువనేశ్వరి తదితరులు నటిస్తున్నారు. వీరు ద్వైత్ సంగీతం సైతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మధు ఎ నాయుడు సినిమాటోగ్రఫీ, కె.రాంగోపాల్ రెడ్డి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|