భాగ్యనగరిలో 'ఆంజనేయులు'
'కిక్' చిత్రం సక్సెస్ తో హ్యాపీ మూడ్ లో ఉన్న రవితేజ ఆగస్టులో మరోసారి 'ఆంజనేయులు'గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్ బాబు సమర్పణలో నటుడు గణేష్ బాబు తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందుస్తున్న 'ఆంజనేయులు' చిత్రం శనివారం నుంచి హైద్రాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకొంటోంది. పరశురామ్ ('యువత' ఫేమ్ ) దర్శకుడు. రవితేజకు జోడిగా 'దుబాయ్ శీను' తర్వాత నయనతార మరోసారి ఇందులో నటిస్తోంది.
ఈ చిత్రం ప్రోగ్రస్ ను గణేష్ బాబు తెలియజేస్తూ, ఇటీవల ఈ చిత్రంలోని రెండు పాటలను అమ్ స్టర్ డామ్, జర్మనీ, ఆస్ట్రేలియాలలో రవితజ-నయనతారపై చిత్రీకరించామనీ, ఈ రెండు పాటలూ సినిమాకి హైలైట్ అవుతాయనీ చెప్పారు. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావాలనన పట్టుదలతో పరుశురామ్ వర్క్ చేస్తున్నారనీ, రవితేజ బాడీ లాంగ్వేజ్ కూ, ఆయన సహన నటననకు తగ్గట్టుగా ఈ చిత్రం రూపొందుతోందనీ అన్నారు. నయనతార గ్లామర్ అట్రాక్షన్ గా అలరిస్తుందని చెప్పారు. హైద్రాబాద్ లో శనివారం ప్రారంభమైన తాజా షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరుగుతుందన్నారు. ఆగస్టులో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజారవీంద్ర, ఆలీ, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం పరశురామ్ అందిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|