సందడిగా కృష్ణ బర్త్ డే
సూపర్ స్టార్ కృష్ణ 66వ జన్మదిన వేడుకను నానక్ రూమ్ గూడ ప్లానెట్-10లోని నివాసంలో అభిమానుల మధ్య ఆదివారం సందడిగా జరుపుకొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన అధ్యక్షుడు దిడ్డి రాంబాబు ఆధ్వరంలో జరిగిన ఈ వేడుకలో కృష్ణతో పాటు శ్రీమతి విజయనిర్మల పాల్గొన్నారు. కృష్ణ కేక్ కట్ చేసి విజయనిర్మలకు తినిపించారు.
అభిమానులు ఎప్పుడూ తన పట్ల చూపుతున్న అభిమానం మరువలేనిదనీ, ఈ ఏడాది ఎన్టీఆర్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అందించడం, సొంత బ్యానర్ పై విడుదలైన 'నేరము శిక్ష' చిత్రం జన్మదిన కానుకలని పేర్కొన్నారు. గత ఏడాది బర్త్ డేకి కృష్ణగారు తనకు బెంజ్ కారు కొనిస్తే, ఈ ఏడాది నేను 'నేరము శిక్ష' చిత్రాన్ని తీసి కానుకగా అందజేశానని అన్నాను. ఈ చిత్రం సక్సెస్ దిశగా వెళ్తోందనీ, ప్రస్తుతం మరో కథ పరిశీలనలో ఉందనీ ఆమె చెప్పారు. కృష్ణ హీరోగా మరో ఆరు నెలల్లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఈ సందర్భంగా 'కృష్ణ సినీ జీవిత చరిత్ర' పుస్కకాన్ని విజయనిర్మల ఆవిష్కరించారు. ఈ వేడుకలో 'నేరము శిక్ష' కథానాయకుడు అఖుల్ కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|