'నా స్టైల్ వేరు' కాంటెస్ట్
డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో దిసిర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన 'నా స్టైలే వేరు' చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ వినూత్న మైన కారు ఉపయోగించారు. ఆ కారు సొంతం చేసుకోవాలనుందా? ఆలస్యం చేయకుండా 'నా స్టైల్ వేరు' కారు కాంటెస్ట్ లో పాల్గొంటే సరిపోతుందని హీరో రాజశేఖర్, కాంటెస్ట్ ను అందుబాటులోకి తెస్తున్న తెలుగు సినిమా స్క్రీన్ డాట్ కామ్ ప్రతినిధులు ఆదివారం తెలియజేశారు.
జపాన్స్ ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈ కారును నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా తయారు చేయించి ఈ సినిమాలో ఉపయోగించారనీ, సుధా కార్స్ అధినేత సుధాకర్ ఈ కారును వినూత్నంగా డిజైన్ చేశారనీ వారు చెప్పారు. ఈ కాంటెస్ట్ లో భాగంగా కారును నగరంలోనే కాకుండా పలు జిల్లాలో తిప్పుతారని అన్నారు. ఈ పోటీలో పాల్గొనే యువత తమ స్టైల్ గురించి చెబుతూ లక్కీ డ్రా కూపన్ లో వారి పేరు, సెల్ నెంబర్ రాసి డ్రాప్ బాక్స్ లో వేయాలి. ఇన్ స్టెంట్ బహుమతులతో పాటు సినిమా రిలీజ్ అనంతరం లక్కీడ్రా తీసి విజేతకు కారును అందజేస్తారు. సో..ఓ ప్రయత్నం చేస్తేఈ కారులో షికారు చేసే లక్కీ విన్నర్ మీరే కావచ్చు.
Be first to comment on this News / Article!
|