చిరంజీవిగా జగపతిబాబు
చిరంజీవి పేరుకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. టైటిల్ లో ఆ పేరు చేర్చి వచ్చిన సినిమాలకూ కొదవ లేదు. ఇప్పుడు హీరో జగపతిబాబు సైతం చిరంజీవి అవతారం ఎత్తబోతున్నారు. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రానికి 'మా ఆయన చిరంజీవి' (అంటే పెద్ద హీరో) అనే టైటిల్ ను ప్రకటించారు. లాఫింగ్ లార్ట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కొడుకు సెంటిమెంటో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్ 'తులసి' చిత్రంతో పరిచయమైన బాలనటుడు అతులిత్ ఈ చిత్రంలో కొడుకు పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబుకు జంటగా నీలిమ నటిస్తోంది. రామానాయుడు స్టూడియోస్ లో తొలిసారిగా ఈ చిత్ర విశేషాలను యూనిట్ తెలియజేసింది.
టైటిల్ లో పేర్కొన్నట్టుగానే తండ్రీకొడుకుల అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిదని జగపతిబాబు తెలిపారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తాను రోడ్డుపై డైరీలు అమ్ముతుంటాననీ, వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అవకాశమున్న సినిమా ఇదనీ చెప్పారు. ఈ సినిమాలో అతులిత్ చివరి వరకూ తనతోటే ఉంటాడనీ, ఓరకంగా సెకెండ్ హీరో అన్నీ అన్నారు. నిలిమి పాత్ర 'శుభలగ్నం' చిత్రంలో ఆమనిని గుర్తు తెచ్చేలా ఉంటుందన్నారు. 'తమ్ముడు' తర్వాత తెలుగుతో పాటు కన్నడంలోనూ సినిమాలు చేసిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. ఈ సినిమాకి డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న టీమ్ అంతా ప్రతిభావంతులేనని అన్నారు. హీరో జగపతిబాబుకూ, తనకూ మధ్య చాలా మంచి సన్నివేశాలున్నట్టు మాస్టర్ అతులిత్ తెలిపారు. తనకు అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసినిమానే జగపతిబాబుతో పనిచేస్తుండటం తన అదృష్టమనీ, మంచి పాత్ర ఇచ్చారనీ నీలిమ పేర్కొంది. ఈ చిత్రానికి భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|