వెంకీ-వైట్ల 'నమో వెంకటేశా'
'చింతకాయల రవి' తర్వాత విక్టరీ వెంకటేష్ సైలెంట్ గా కమల్ హాసన్ 'ఈనాడు' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ సోలో హీరోగా ఆయన చేయబోయే చిత్రం గురించిన సస్పెన్స్ కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉంది. క్రిష్ 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం సెట్స్ పైకి రానుందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే సినిమా సెకండాఫ్ లో మార్పులను వెంకీ ప్రపోజ్ చేయడం, అందుకు క్రిష్ సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి రాలేదు. తాజాగా హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్లతో పనిచేసేందుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రానికి 'నమో వెంకటేశా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
'రెడీ', 'దుబాయ్ శీను', 'కింగ్' చిత్రాలతో వరుసగా మూడు హిట్లిచ్చిన శ్రీనువైట్ల ఈసారి కూడా వెంకటేష్ తో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చక్కటి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'సై' ఫేమ్ గిరి నిర్మించనున్నారు. ఇందులో వెంకటేష్ కు జోడిగా త్రిష మరోసారి నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ చూరగొంది. ఈనెలాఖరులోనే ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|