ప్లేబాయ్ తో నీతూచంద్ర
వివాదాల నీతూచంద్ర ఇప్పుడు హిందీతో పాటు దక్షిణాదిలోనూ హాటెస్ట్ గాళ్ అనిపించుకుంటోంది. 'గోదావరి' చిత్రంలో సుమంత్ మరదలి పాత్రలో పరికిణీ ఓణీతో కనపించిన నీతూచంద్ర ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ తో 'ఎవడైతే నాకేంటి' చిత్రంలో నటించి ఆ చిత్రం షూటింగ్ లో ఉండగానే తనను సదరు హీరో వేధించారంటూ వార్తల్లోకి ఎక్కింది. ముంబై పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ వివాదాన్ని లేవనెత్తడం కూడా ఆమెకు పబ్లిసిటీని పెంచినట్టయిది. తమిళంలో విజయవంతమైన 'యావరుమ్ సలమ్' చిత్రం హిందీలో '13 బి'గా విడుదల కావడంతో నీతూ పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమధ్యన ఎకాఎకిన ఓ పురుషుల మ్యాగజైన్ కవర్ కు ఎక్కడంతో నీతూ అందచందాలు 'బ్లో-యప్స్' రూపంలో అందర్నీ ఆకట్టుకుని పలువురు దర్శక నిర్మాతల దృష్టిని ఆకట్టుకుంటోంది. తాజాగా హీరో విశాల్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నీతూ వచ్చిచేరింది.
'పిస్తా' తర్వాత విశాల్ కథానాయకుడుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో విశాల్ ప్లేబాయ్ తరహా పాత్రను పోషించనున్నారు. కథానుసారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. 'పిస్తా' కథానాయిక శ్రియ, విశాల్ తో గతంలో 'ప్రేమచదరంగం'లో నటించిన రీమాసేన్ ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్లుగా ఎంపికకాగా, మూడో హీరోయిన్ గా నీతూచంద్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తమిళంలో 'తీరాద విలైయాట్లు పిళ్లై' అనే పేరు పెట్టారు. ఈ ద్విభాషా చిత్రం ద్వారా తిరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పవన్ తో 'కొమురం పులి', మహేష్ తో 'వరుడు' చిత్రాలు నిర్మిస్తున్న సింగనమల రమేష్ ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించి హైద్రాబాద్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరిపేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|