హన్సిక డ్రీమ్ హీరో...
హ్యాట్రిక్ హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటున్న హన్సికా మోత్వాని టాలీవుడ్ లో లాంగ్ కెరీర్ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అల్లు అర్జున్ తో 'దేశముదురు', ఎన్టీఆర్ తో 'కంత్రీ', ప్రభాస్ తో 'బిల్లా' చిత్రాలు తన కెరీర్ కు గట్టి పునాది వేయడంతో ఇప్పుడు తన మనసులోని కోరికను కూడా బయటపెట్టింది. ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలనేది తన చిరకాల కోరిక అంటూ చెప్పుకొచ్చింది. ఆమె సన్నిహిత వర్గాల కథనం ప్రకారం..మహేష్ తో నటించే అవకాశమంటూ వస్తే ఐటెం సాంగ్ లో నర్తించేందుకు కూడా ఆమెకు ఎలాంటి అభ్యంతరాలు లేవట.
'ఇండియాలోని హ్యాండ్ సమ్ హీరోల్ల మహేష్ ఒకరు. ఆయనతో ఒక సినిమాలైనానా నటించాలనే కోరిక ఎప్పట్నించో నాకుంది' అని హన్సిక తన మనోగతాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసింది. ప్రస్తుతం హన్సిక కొత్త ప్రాజెక్టుల ఎంపికలో బిజీగా ఉంటే, మహేష్ 'వరుడు' చిత్రంతో బిజీగా ఉన్నారు. హన్సిక కోరికను మహేష్ తన తదుపరి చిత్రంలో తీర్చే అవకాశాలు లేకపోనూ లేదు. హన్సిక తదుపరి చిత్రంలో నితిన్ తో జోడీ కట్టబోతోంది.ఈ చిత్రాని 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఫేమ్ ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈనెల 15న ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది.
Be first to comment on this News / Article!
|