'మల్లన్న' సోల్డ్ఔట్...
విక్రమ్ కథానాయకుడుగా నటించిన 'మల్లన్న' చిత్రం అనౌన్స్ మెంట్ రోజునే సంచలం సృష్టించి ఇప్పుడు విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను, భారీ అంచనాలను పెంచుకుంటూ పోతోంది. విక్రమ్ కు ఉన్న స్టార్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రం తమిళ వెర్షన్ 'కందస్వామి'పై కోలీవుడ్ లో మరింత ఎక్కువ అంచనాలు ఉన్నాయి. విక్రమ్ సైతం ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని స్వయంగా ప్రమోషన్ వర్క్ చేపడుతున్నారు. 35 కోట్ల రూపాయల బడ్జెట్ కలైపులి థాను నిర్మించిన ఈ చిత్రానికి సుశీ గణేషన్ దర్శకత్వం వహించారు. విక్రమ్ కు జోడిగా అందాల నటి శ్రియ నటించింది. ఈ చిత్రం పూర్తి స్థాయిలో బిజినెస్ పూర్తి చేసుకుందని చెన్నై వర్గాల తాజా భోగట్టా. ఇప్పటికే 4 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా, ఈ చిత్రం ఓవర్సీ స్ రైట్స్ ను తాజాగా అయ్యంగార్ ఇంటర్నేషనల్ దక్కించుకుంది. ఇందుకోసం 5 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించింది. ఈ విషయాన్ని అయ్యంగార్ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రతినిధితో పాటు చిత్ర దర్శకనిర్మాతలు సైతం ధ్రువీకరించారు.
అమెరికా, బ్రిటన్, మలేసియా, సింగపూర్, కెనడా, యూరప్, దుబాయ్, శ్రీలంకలలో ఈ చిత్రాన్ని అయ్యంగార్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. యూరప్ మార్కెట్ ను ఆకట్టుకునేందుకు స్వానిష్, ఇలాలియన్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించబోతున్నారు. ఈనెలలోనే 'మల్లన్న' విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|