నాని రఫ్..తనీష్ సాఫ్ట్
తొలి చిత్రంతో సక్సెస్ అయిన ఇద్దరు యువ హీరోలు మలి సినిమాతో మంచి బ్రేక్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరు 'అష్టాచమ్మ' కథానాయకుడు నాని. మరొకరు 'నచ్చావులే' హీరో తనీష్. ఈ ఇద్దరూ కలిసి రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'రైడ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమ కెరీర్ ను స్పీడ్ చేసి మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు నాని, తనీష్ చెప్పారు. ఈనెల 5న 'రైడ్' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి చిత్ర విశేషాలను, తమ తదుపరి ప్రాజెక్ట్ లను ముచ్చటించారు.
'నచ్చావులే' చిత్రం తర్వాత మల్టీస్టారర్ లో నటించే అవకాశం రాగానే వెంటనే అంగీకరించాననీ, ఇద్దరు ముగ్గురు హీరోలుంటే తప్పనిసరిగా ఆ సినిమాకి మంచి స్పాన్ ఉంటుందనీ తనీష్ పేర్కొన్నారు. యూత్ ను బేస్ చేసుకుని 'రైడ్' చిత్రం రూపొందిందనీ, నాని రఫ్ అయితో ఇందులో తాను సాఫ్ట్ క్యారెక్టర్ పోషించాననీ, ఈ రెండు పాత్రలతో యూత్ తమను ఐడెంటిఫై చేసుకుంటారనీ అన్నారు. మంచి అభిరుచి, కమిట్ మెంట్ ఉన్న నిర్మాత బెల్లకొండ సురేష్ అని కితాబిచ్చారు. ఈనెల 14 నుంచి మోహన్ రాజ్ దర్శకత్వంలో సాయిదేవా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తన కొత్త చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ తన అభిమాన హీరోలని చెప్పారు. నాని మాట్లాడుతూ, ఇందులో తాను రఫ్ అండ్ టఫ్ పాత్ర పోషించాననీ, ఈ సినిమా సమయంలో తానూ, తనీష్ అన్నదమ్ముల్లా కలిసిపోయామనీ చెప్పారు. బాలనటుడిగా పలు సినిమాల్లో అనుభవమున్న తనకు హీరోగా 'అష్టాచమ్మ' గుర్తింపు తెస్తే, 'రైడ్' చిత్రం కెరీర్ పరంగా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బెల్లంకొండ సురేష్ వంటి అభిరుచి గల నిర్మాతతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాఘువేంద్రరావు, కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న నందిని దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఉంటుందని చెప్పారు. తాను కమల్ హాసన్ కు వీరాభిమానినని తెలిపారు.
Be first to comment on this News / Article!
|