ఎడిటర్ మోహన్ కు 'కిక్'
ఒకప్పుడు తమిళంలో హిట్టయిన చిత్రాల రీమేక్ కోసం తెలుగు నిర్మాతల మధ్య పోటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చి తెలుగు హిట్ చిత్రాల రైట్స్ ను తమిళ నిర్మాతలు ఎగరేసుకుపోతున్నారు. ఈ ఏడాది సమ్మర్ హిట్ గా దుమ్మురేపుతున్న 'కిక్' చిత్రం తమిళ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ ఫ్యాన్సీ ఆఫర్ తో సొంతం చేసుకున్నారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన 'కిక్' చిత్రం నాలుగవ వారంలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఎడిటర్ మోహన్ ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను పొందారు.
ఎడిటర్ మోహన్ తెలుగులో 'హనుమాన్ జంక్షన్', 'హిట్లర్' వంటి పలు హిట్లతో పాటు తమిళంలో తన కుమారుడు రవి కథానాయకుడుగా 'జయం', 'ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన తనయుల్లో రవి హీరో కాగా, మరో తనయుడు రాజా ('హనుమాన్ జంక్షన్' ఫేమ్) దర్శకుడు. కొద్దికాలంగా రవి, రాజా కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రానికి ప్లాన్ చేస్తున్న ఎడిటిర్ మోహన్ ఇప్పుడు ఆ కాంబినేషన్ లోనే 'కిక్' తమిళ వెర్షన్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|