'వేర్ ఆర్ యు సోఫియా'
న్యూయార్క్ లోని ఎటర్నల్ మైండ్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన ప్రవాసాంధ్రుడు నాగేంద్ర కర్రి తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో 'వేర్ ఆర్ యు' అనే హాలీవుడ్ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. దీనికితోడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో 'మాబ్ స్టర్' అనే మరో కొత్త చిత్రాన్ని కూడా ఆయన ప్రకటించారు. హైద్రాబాద్ లోని తాజ్ కృష్ణలో బుధవారం ఉదయం ఆ విశేషాలను ఆయన తెలియజేశారు.
కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన తనకు థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉందనీ, ఫిల్మ్ మేకింగ్ అంటే తనకు ఫ్యాషన్ అనీ నాగేంద్ర కర్రి తెలిపారు. తొలి ప్రయత్నంగా 'వేర్ ఆర్ యు సోఫియా' చిత్రానికి సొంతంగా కథ రాసి దర్శకనిర్మాణ బాధ్యతలు చేపట్టినట్టు చెప్పారు. అపరిచితుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే కథాంశంతో యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శితమై అరుదైన ప్రశంసలు అందుకుందన్నారు. 96 నిమిషాల నిడివి గల ఈ సైకో థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసి కుర్చీల్లో కట్టిపడేస్తుందన్నారు. కథనం, క్యారెక్టర్లు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలని అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థ నుంచి 'మాబ్ స్టర్' అనే మరో చిత్రాన్ని కూడా తీయబోతున్నామనీ, ఇండియాలోని కీలక ప్రాంతాల్లో షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. ఇండియాలోనే నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్ నిర్వహిస్తామనీ, ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం ఆశించే ఇండియన్ కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|