'జయం' రవి వివాహం
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు, తమిళ హీరో 'జయం' రవి వివాహం ఆర్తి తో చెన్నైలోని ఐటిసి పార్క్ షెరటాన్ హోటల్ నిలో మ్యారేజ్ హాలులో గురువారం ఉదయం 7.30 గంటలకు కన్నులపండువగా జరిగింది. 8.46 నిమిషాల ముహూర్తానికి ఆర్తి మెడలో ఆయన మూడుముళ్లు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తమిళ 'జయం'తో హీరోగా పాపులర్ అయిన రవి ఆ తర్వాత 'సమ్ థింగ్ సమ్ థింగ్ ఉనక్కుం ఎనక్కు', 'ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి', 'సంతోష్ సుబ్రమణియం' వంటి 9 చిత్రాల్లో నటించారు. ఆర్తి చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో గ్యాడ్యుయేషన్, స్కాట్ లాండ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్తి, రవి తమ అభిరుచులు కూడా ఒకటి కావడంతో పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. ఈ వివాహ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, జయరామ్-పార్వతి జయరామ్, అర్జున్, సుందర్ సి-ఖుష్భూ, రాధారవి, ఎం.ఎస్.భాస్కర్, అబ్బాస్, రాధికా శరత్ కుమార్, మీనా, మోహన్, సంఘవి, సిబి, మంజులా విజయకుమార్, శ్రీదేవి విజయకుమార్, గాయత్రి రఘురామ్, భానుచందర్, ప్రభు కుమారుడు విక్రమ్, దర్శకులు వెంకట్ ప్రభు, అమీర్, జననాథన్, కిరీడం విజయ్, హరి, ఎస్.పి.ముత్తురామన్, తెలుగు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సుబ్రమణియం శివ, ముగవరి దురై, నిర్మాతలు ఎపిబి చరణ్, అయ్యంగారన్ అరుణ్ పాండ్యన్, అయ్యంగారన్ విజయ్ కుమార్, రుక్మాంగదన్, ఎం.ముత్తురామన్, టి.రామారావు, మహేంద్ర జైన్, పంజు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|