130 ప్రింట్లతో 'కరెంట్' 19న
నాగార్జున మేనల్లుడు సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటగా నాగ్ క్రియేషన్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కరెంట్'. సూర్యప్రతాప్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో గురువారంనాడు ఆ విశేషాలను తెలియజేశారు.
చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు. అలాగే దాదాపు 200 థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ కు కూడా చక్కటి స్పందన వస్తోందన్నారు. అందుకు తగ్గట్టే ఈ నెల 19న 130 ప్రింట్లతో 150 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని వైజాగ్ ఏరియాకి దిల్ రాజు పంపిణీ చేస్తున్నారనీ, జూన్ రెండో వారంలో విజయవాడలో ప్లాటినం డిస్క్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో నాగార్జున పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ పోటీ నిర్వహించామనీ, విజేతలకు చిత్రం అర్ధశతదినోత్సవంలో బహుమతులు అందజేస్తామనీ చెప్పారు. ప్రసాసాంధ్రుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇకపైన తమ 'కరెంట్' చిత్రం ఫంక్షన్ ఎక్కడ జరిగిగా ఆ దాడులకు నిరసనగా ఒక నిమిషం పాటు మౌనం పాటించలదలచుకున్నామని పేర్కొన్నారు. సుశాంత్ మాట్లాడుతూ, దేవీశ్రీ ప్రసాద్ చాలా మంచి సంగీతం ఇచ్చారనీ, విదేశాల నుంచి కూడా స్నేహితులు ఫోన్ చేసి పాటలు బాగున్నాయంటూ చెప్పడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ సినిమా ఆడియోలో ఆరవ పాటను కూడా చేర్చనున్నామని తెలిపారు. కథకు తగ్గ టైటిల్ ఇదనీ, దేవీశ్రీ ప్రసాద్ అందించన పాటలకు చక్కటి స్పందన వస్తోందనీ, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నామనీ సూర్యప్రతాప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన నాగసుశీల కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|