'మౌనరాగం' మొదలైంది
'నచ్చావులే', 'రైడ్' చిత్రాల ఫేమ్ తనీష్ కథానాయకుడుగా 'మౌనరాగం' పేరుతో ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది సాయిదేవా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బాలాజీ దర్శకుడు. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో గురువారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి రాష్ట్ర మంత్రి వట్టి వసంత్ కుమార్ క్లాప్ ఇవ్వగా, శేఖర్ కమ్ముల స్విచ్చాన్ చేశారు. డి.సురేష్ బాబు, మరో హీరో వరుణ్ సందేష్ తదితరులు పాల్గొన్నారు.
శానం నాగ అశోక్ కుమార్ మాట్లాడుతూ, తాము గతంలో నిర్మించిన నిర్మించిన 'శుభాకాంక్షలు', 'వసంతం', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాలు ఎంతగానో ప్రేక్షకాదరణ చూరగొన్నాయనీ, వాటి తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందనీ అన్నారు. విజయ్ బాలాజీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ, చక్కటి కథతో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందనీ, మరో రెండు వారాల్లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. సురేష్ కృష్ణ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసినట్టు విజయ్ బాలాజీ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో తాను పక్కింటి అబ్బాయిలా కనిపిస్తానని తనీష్ తెలిపారు. సంగీత దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంస్థలో తాను చాలా సినిమాలు చేశాననీ, ఈ చిత్రానికి మరింత మంచి సంగీతం అందించే బాధ్యత తనపైన ఉందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, జీవా, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, నర్సింగ్ యాదవ్, హేమ తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, షమన్ మిత్రు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|