రవితేజ కొత్త సినిమా షురూ
'కిక్' ఉత్సాహంతో ఉన్న రవితేజ, శ్రీకాంత్ తో 'మహాత్మ' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న కృష్ణవంశీని కలుపుతూ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ లోని సంస్ధ కార్యాలయంలో గురువారంనాడు జరిగాయి. ఆసక్తికరంగా బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'రైడ్' చిత్రం ఈ శుక్రవారమే విడుదలవుతోంది.
రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ లో గతంలో 'సింధూరం', 'ఖడ్గం' వంటి చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకన్నప్పటికీ ఇప్పటికి కుదిరింది. తాజా చిత్రంపై బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ, జూలై మొదటివారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందన్నారు. ఈ చిత్రానికి రవి ఉప్పలపాటి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Be first to comment on this News / Article!
|