'నా స్టైలే వేరు' క్లీన్ యు
డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా దిసిర ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్ దర్శకత్వంలో మాగంటి గోపీనాథ్ నిర్మించిన చిత్రం 'నా స్టైలే వేరు'. శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫెకెట్ లభించిందనీ, ఈనెల 12న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత తెలిపారు.
రాజశేఖర్, భూమిక చక్కటి వైవిధ్యమున్న పాత్రల్లో నటించారనీ, యూత్ తో పాటు ఇంటిల్లిపాది చూడదగ్గ చిత్రంగా రాంప్రసాద్ దీనిని తెరకెక్కించారనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందన్నారు. అనూప్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు వేటికవే ప్రత్యేకత కలిగి ఉంటాయని అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత ఇచ్చిన సహకారం మరువలేనిదని రాంప్రసాద్ పేర్కొన్నారు. ఇందులోని ఐదు పాటలు సందర్భోచికంగా ఉంటాయని అనూప్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, విజయ్ కుమార్, చలపతిరావు, గిరిబాబు, ఆహుతిప్రసాద్, జీవా, బెనర్జీ, అన్నపూర్ణ, సురేఖావాణి తదితరులు నటించారు. దిసిర ప్రొడక్షన్స్ కథ, ఎస్.అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|