తిరుపతిలో 'వెంగమాంబ'
మీనా టైటిల్ పాత్రలో వి.ఎం.సి.ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో వి.దొరస్వామిరాజు నిర్మిస్తున్న 'వెంగమాంబ' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. చివరి షెడ్యూల్ గురువారం నుంచి తిరుపతిలో మొదలైంది. ఈ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
తిరుపతిలో మొదలైన చివరి షెడ్యూల్ ఈనెల 15వరకూ జరుగుతుందని దొరస్వామిరాజు తెలిపారు. ఇందులో భాగంగా క్లైమాక్స్ తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నామని చెప్పారు. క్లైమాక్స్ కోసం తిరుపతిలో ప్రత్యేకంగా వేంకటేశ్వర స్వామి గర్భగుడి సెట్ వేసినట్టు చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పారు. తిరుపతిలోనే ఈనెల 7న ఆడియో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వేంకటేశ్వర స్వామి భక్తురాలిగానే కాకుండా సంఘసంస్కర్తగా కూడా వెంగమాంబలో మరో కోణం ఉందని చెప్పారు. ఇందులో 22 పాటలు ఉన్నాయనీ, వీటికి కీరవాణి ఎంతో సమయం వెచ్చించి అద్భుతమైన స్వరాలను కూర్చారని చెప్పారు. విఎంసి వంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. వృత్తిపరంగా ఈ చిత్రం తనకెంతో సంతృప్తి నిస్తోందని మీనా తెలిపింది. వేంకటేశ్వర స్వామిగా సాయికిరణ్ నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ బాబు, అశోక్ కుమార్, గుండు సుందర్శన్, కృష్ణవేణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|