'ఆ ఒక్కడు' సక్సెస్ మీట్
విలన్ పాత్రల అజయ్ కథానాయకుడుగా రూపొందిన 'ఆ ఒక్కడు' చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అమెరికాలో పలు తెలుగు చిత్రాల డిస్ట్రి బ్యూషన్ రంగంలో పేరున్న టాలీ 2 హాలీ పిక్చర్స్ పతాకంపై తొలిసారిగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ఎన్.ఎస్.మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ శనివారంనాడు సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.
అజయ్ మాట్లాడుతూ, ఇది యాక్షన్ సినిమా కాదనీ, అంతా యాక్షన్ అనుకుని వస్తారు కానీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రం ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ నడుస్తుందనీ, ప్రతి సన్నివేశం ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తుందనీ అన్నారు. హీరోగా తనకు ఈ చిత్రంతో తొలి సక్సెస్ వచ్చిందని అన్నారు. దర్శకుడు మూర్తి మాట్లాడుతూ, ఈ చిత్రానికి కథే హీరో అనీ, అజయ్ హీరోలాంటి పాత్ర మాత్రమేననీ అన్నారు. ప్రేక్షకులు యాక్షన్ ను దృష్టిలో పెట్టుకుని డిజప్పాయింట్ అయ్యారని తెలిసిందని అన్నారు. అయితే ఈ చిత్రానికి కథే హీరో అనీ, అజయ్ హీరోలాంటి పాత్ర మాత్రమేననీ అన్నారు. చివరి అరగంట చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ప్రేక్షకుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని చెప్పారు. నిర్మాతలలో ఒకరైన సుధాకర్ చాగంటి మాట్లాడుతూ, ఇదేదో యాక్షన్ సినిమా అనుకుని, పెద్దపెద్ద ఫైట్లు
ఉండాయనీ ప్రేక్షకులు వస్తున్నారనీ, అయితే అలాంటి ఫైట్లు ఇందులో లేవనీ చెప్పారు. సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగే చక్కటి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అజయ్ కు జోడిగా మధుమిత నటించగా, క్రిమినల్ లాయర్ గా సురేష్ గోపి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నాజర్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|