సందేశాన్నిచ్చే 'నజరానా'
ఐమాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వై.శైలజ సమర్పణలో వై.కోటిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మెసేజ్ ఓరియెంటెడ్ ప్రేమకథా చిత్రం 'నజరానా'. నటి కల్యాణి ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ లో ప్రారంభమైంది. బాలనటులపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇవ్వగా, సీనియర్ పాత్రికేయుడు భగీరథ కెమెరా స్విచ్చాన్ చేశారు. సి.కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దర్శకనిర్మాత కోటిబాబు మాట్లాడుతూ, రెండు బద్ధశత్రువులైన దేశాల్లో ఉన్న పిల్లల మధ్య స్నేహం ఏ విధంగా పరిమళించింది, దాని పర్యవసానాలేమిటనేది ఈ చిత్ర కథాంశంమని చెప్పారు. ఈ చిత్రంలో చక్కటి సందేశాన్ని పొందుపరచామని తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఆలోచింపజేస్తుందన్నారు. ప్రముఖ హీరోయిన్ కల్యాణి ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నాన్ స్టాప్ గా జరిగే సింగిల్ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|