శ్యామ్-స్నేహ 'నీలో నాలో'
'కిక్' సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన శ్యామ్ ఇప్పుడు 'కిక్ శ్యామ్'గా గుర్తింపు పొందారు. ఆ చిత్రంలో సెకెండ్ హీరోగా నటించిన శ్యామ్ ఇప్పుడు కథానాయకుడుగా 'నీలో...నాలో' అనే చిత్రంలో నటిస్తున్నారు. అందాల తార స్నేహ హీరోయిన్. 'బిట్వీన్ యు అండ్ మి' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. నైన్త్ చానల్ పతాకంపై నందు దర్శకత్వంలో విజయశ్రీ నందకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ కమెడియన్ సునీల్, 'ఆనందం' ఫేమ్ రేఖ, జూనియర్ రేలంగి తదితరులు ఇత పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
దర్శకుడు నందు మాట్లాడుతూ, 'కిక్' శ్యామ్ నటన, స్నేహ గ్లామర్, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షలుగా నిలుస్తాయని చెప్పారు. ఈవారంలోనే మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదల చేసి నెలాఖరుకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి కృష్ణవేణి సంభాషణలు, కొత్త పల్లి రామకృష్ణ సినిమాటోగ్రఫీ, పి.బి.బాలాజీ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|