'లవ్ 4 ఎవర్'లో దీపిక
ప్రేమకథా ఇతివృత్తాలు తీయడంలో జయంత్ సి.పరాన్జీకి ప్రత్యేకత ఉంది. తన సినిమాల్లో బాలీవుడ్ తారలను తెలుగుతెరకు పరిచయం చేయడంలోనూ జయంత్ తన స్పెషాలిటీని చాటుకుంటూ ఉంటారు. 'ప్రేమించుకుందాం రా'తో అంజలా జవేరి, 'ప్రేమంటే ఇదేరా'తో ప్రీతిజింటా, 'టక్కరి దొంగ'తో బిపాసాబసులను హీరోయిన్లుగా ఆయన తెలుగులో పరిచయం చేశారు. 'రావోయి చందమామ' చిత్రంలో ఐశ్వర్యారాయ్ చేత ఓ ప్రత్యేక పాట కూడా చేయించారు. తాజాగా ఆయన హిందీ 'ఓం శాంతి ఓం' కథానాయిక దీపిక పడుకునేని 'లవ్ 4 ఎవర్' చిత్రంలో ప్రత్యేక పాట ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. లాఫింగ్ వాటర్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జయంత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రణదీప్, మృధుల జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సరికొత్త ప్రేమకథా ఇతివృత్తంగా జయంత్ తెరకెక్కిస్తున్నారు.
దీపిక ప్రత్యేక సాంగ్ లో నటిస్తోందంటే ఈ పాటకు ఏదో ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ఈనెల 24 నుంచి వార రోంజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో 'లవ్ 4 ఎవర్' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ-అన్విత కథ, రాజసింహ మాటలు, జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|