బ్యాంకాక్ లో '...చిరంజీవి'
జగపతిబాబు కథానాయకుడుగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మా నాన్న చిరంజీవి'. మాస్టర్ అతులిత్ ('తులసి' ఫేమ్) కీలక పాత్ర పోషిస్తుండగా, జగపతిబాబుకు జోడిగా నీలిమ నటిస్తోంది. లాఫింగ్ లార్డ్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలాభాగం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం ఓ పాటను ఈనెల 10 నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నట్టు దర్శకుడు తెలిపారు.
తండ్రీకొడుకుల అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిదనీ, వినోదంతో పాటు భావోద్వాగాలకు అవకాశమున్న ఫీల్ గుడ్ మూవీ అనీ జగపతిబాబు తెలిపారు. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో తాను రోడ్లపై డైరీలు అమ్ముతుంటానని చెప్పారు. అతులిత్ చివరి వరకూ తనతోటే ఉంటాడనీ, ఓ రకంగా సెకెండ్ హీరో అనీ పేర్కొన్నారు. అలాగే నీలిమ పాత్ర 'శుభలగ్నం' చిత్రంలో ఆమనిని గుర్తి చేస్తుందన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఇందులో నటిస్తున్నాననీ, ఎలా చెప్పారో అంతకంటే బాగా సినిమా తీస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి భరణి కె ధరణ్ సినిమాటోగ్రఫీ, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|