మైండ్ గేమ్ తో 'కాఫీబార్'
విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన యువతీ యువకుల కథాంశంతో 'కాఫీ బార్' చిత్రం రూపొందుతోంది. 'కోకిల', 'కీచురాళ్లు', 'సంకీర్తన' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన దర్శకుడు గీతాకృష్ణ తాజాగా బ్లూఫాక్స్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శశాంక్, బియాంకదేశాయ్, అతుల్ కులకర్ణి, గిరీష్ కర్నాడ్, బేబి శివానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ 80 శాతం షూటింగ్ పూర్తి చేసినట్టు గీతాకృష్ణ తెలిపారు.
హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరులో ఈ చిత్రం షూటింగ్ జరిపినట్టు తెలిపారు. కాపీబార్ లో కూర్చున్న కొంతమంది యువకుల ఆలోచనలు టేకాఫ్ గా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. మైండ్ గేమ్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని యూనివర్శల్ థాట్ తో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఆద్యంతం సరదాగా ఉంటూనే టెర్రరిజం పాయింట్ అంతర్లీనంగా ఉంటుందన్నారు. ఈ సినిమా మొత్తం రెడ్ వన్ కెమెరాతో చిత్రీకరిస్తుండటం ప్రధాన విశేషమని చెప్పారు.
Be first to comment on this News / Article!
|