అవసరమైతే ఎక్స్ పోజింగ్!
ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ కొద్ది మందో మినహాయిస్తే హీరోయిన్లందరిదీ ఒకే మాట. 'కథ డిమాండ్ చేస్తే అభ్యంతరం లేదు' అన్నదే. 'లక్ష్మీ కల్యాణం'తో పరిచయమై 'చందమామ' చిత్రంతో హీరోయిన్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు ఈ కోవలేనే చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందు తున్న'మగధీర', అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్య-2' చిత్రాల్లో నటిస్తోంది. యువహీరో రామ్ తో మరో సినిమా చేస్తోంది. వరుస క్రమంలో ఈ మూడు చిత్రాలు ఇదే ఏడాది విడుదల కాబోతున్నాయి. వీటికి తోడు తమిళంలోనూ కాజల్ నటిస్తోంది.
ఇవాల్టి క్రేజీ హీరోయిన్ల రేసులో ఎక్స్ పోజింగ్ గురించి నీ అభిప్రాయమేమిటని ఓ ఇంటర్వ్యూలో కాజల్ ను అడిగనప్పుడు 'నా దృష్టిలో గ్లామర్ వేరు. ఎక్స్ పోజింగ్ వేరు. మోడ్రన్ గాళ్ గా కనిపించడానికి, అందుకు తగిన కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు. అయితే కథ డిమాండ్ చేస్తే సన్నివేశపరంగా నటించడానికి ఇబ్బంది లేదు. అలాంటి అవసరం లేకపోతే ఎక్స్ పోజింగ్ కు నో చెప్పేస్తాను' అంటూ తన మనసులోని మాటను వెల్లడించింది. దర్శక-కథకులు తలుచుకుంటే ఏ సన్నివేశమైనా కథలో అంతర్భాగమే అవుతుందని కాజల్ కు తెలియదంటామా? సో...ఇవాల్టి ఫ్యాషన్ అయిన బికినీ బ్రిగేట్ లో కాజల్ చేరడానికి పెద్దగా సమయం పట్టేట్టు లేదు.
Be first to comment on this News / Article!
|