స్విట్జర్లాండ్ కు 'ఏక్ నిరంజన్'
ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఏక్ నిరంజన్'. పూరీ జగన్నాథ్ కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తుండటంతో పాటు చిత్ర సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అత్యునత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు పూరీ జగన్నాథ్ తెలిపారు.
ఆదిత్య రామ్ మరిన్ని విశేషాలను తెలియజేస్తూ, ఈ చిత్రం కోసం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో ఎనిమిది ఎకరాల విస్త్రీర్ణంలో హైద్రాబాద్ నగరానికి చెందిన ఓ ఏరియా సెట్ ను నిర్మించామని అన్నారు. కళాదర్శకుడు చిన్నా ఈ సెట్ ను అద్భుతంగా రూపొందించారనీ, క్లాక్ టవర్ తో పాటు నాలుగురోడ్ల కూడలి, హనుమాన్ దేవాలయం, దోభీ ఘాట్, హీరోహీరోయిన్ల ఇళ్లు, కొన్ని వీధులు ఈ సెట్ లో నిర్మించామని చెప్పారు. ఈ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు చెప్పారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన నాలుగు భారీ సెట్స్ లో ప్రభాస్, కంగనా రనౌత్ లపై ఓ పాటను తీశామని తెలిపారు. ఈనెల 18 నుంచి స్విట్జర్లాండ్ లో రెండు పాటల్ని నెలాఖరు వరకూ చిత్రీకరిస్తామని చెప్పారు. జూలైలో 30 రోజుల పాటు బ్యాంకాక్ లో భారీ షెడ్యూల్ చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభాస్ నటన ఈ చిత్రానికి హైలైట్ అవుతుందనీ, 'పోకిరి' వంటి పెద్ద హిట్ ను ఇండస్ట్రీకి ఇచ్చిన పూరీ జగన్నాథ్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. తమ సంస్థ పేరు నిలబెట్టే ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోందనీ, సెప్టెంబర్ నాటికి సినిమా పూర్తవుతుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి, శ్రావణ్ తదితరులు నటిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|