20 నుంచి ఎన్టీఆర్ 'అదుర్స్'
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్తి స్వస్థత చేకూరడంతో మళ్లీ 'అదుర్స్' సెట్స్ లో కాలుపెట్టనున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైద్రాబాద్ తిరిగి వస్తుండగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నడుము, చేతికి, ముఖానికి బలమైన గాయాలు తగలడంతో వైద్య చికిత్స అనంతరం ఆయన మూడు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన నటిస్తున్న 'అదుర్స్' చిత్రం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ కు పూర్తి స్వస్థత చేకూరడంతో ఈనెల 20 నుంచి మళ్లీ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ 'అదుర్స్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఈనెల 20 నుంచి షూటింగ్ లో పాల్గొంటారనీ, మూడు నెలల పాటు ఏకథాటిగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ధ్రువీకరించారు. ప్రస్తుతం తన ధ్యాసంతా ఈ చిత్రం షూటింగ్ పైనే ఉందని ఆయన చెప్పారు. ఏకధాటి షెడ్యూల్ కారణంగా అమెరికాలో జరుగనున్న తానా సభలకు ఎన్టీఆర్ వెళ్లే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|