'యు అండ్ ఐ' షూటింగ్ పూర్తి
జీవితంలో ఉన్నత లక్ష్యాల సాధనలో పడి ఒక్కోసారి చిన్నచిన్న ఆనందాలను మనం కోల్పోతుంటాం. అయితే అలాంటి ఆనందాలను సైతం సొంత చేసుకున్నప్పుడే జీవితంలోని మాధుర్యం తేటతెల్లమవుతుంది. 'స్మాల్ ప్లెజజర్స్'కు అర్ధవంతమైన సెల్యులాయెడ్ రూపమే
'యు అండ్ ఐ' చిత్రమని యువదర్శకుడు రంజిత్ బెల్లూరి తెలిపారు. న్యూజెర్సీలోని ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ (జెఎస్ఎంఎన్) అధినేత, తెలుగు ప్రముఖుడు రవీందర్ తోట ఈ చిత్రాన్ని జెఎస్ఎంఎస్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యశోదా దేవి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు కుర్రాడు రోహన్, ఉత్తరాది అమ్మాయి అదితి చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలోని చివరి పాటను గోల్గొంబ టూంబ్స్ లో మంగళవారంనాడు చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు రంజిత్ బెల్లూరి మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టే ఇది ఇద్దరి మధ్య నడచే కథ అనీ, హీరోహీరోయిన్ చుట్టూనే కథ ఉంటుందనీ చెప్పారు. తెలుగు వచ్చే రెగ్యులర్ ఫార్ములా చిత్రాల స్టఫ్ మాత్రం ఇందులో ఉండదనీ, అదే ఈ చిత్రంలోని స్పెషాలిటీ అనీ అన్నారు. క్వాలిటీ తెలుగు ఫిల్మ్ కు సరికొత్త నిర్వచనం చెప్పబోతున్నామని అన్నారు. రోహన్ తన పాత్రలో చక్కగా ఇమిడిపోయాడనీ, తన అంచనాలకు మించి అదితి నటించిందనీ చెప్పారు. హీరో పాత్రపరంగా ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటాడనీ, తన జీవితంలో ఎదురైన పెద్ద సమస్యను ఎలా అధిగమించాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. ఈనెల 18న ఆడియోను, జూలైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. హీరో రోహన్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి దర్శకుడు రంజిత్ పనితనం, సినిమాటోగ్రఫీ, సంగీతం హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. ఈ రోజు ఓ బిట్ సాంగ్ తనపై తీస్తున్నారని చెప్పారు. నృత్య దర్శకుడు ప్రేమ్ గోపి మాట్లాడుతూ, ఇందులోని పాటలన్నీ సందర్భోచితంగా ఉంటాయనీ, ఈ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందనీ అన్నారు. అంతా కొత్తనటులు నటిస్తున్న ఈ చిత్రానికి రంజిత్ బెల్లూరి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందించారు. అనంత్ శ్రీరాం సాహిత్యం, శంకర్ కె సినిమాటోగ్రఫీ, మధురెబ్బ కళాదర్శకత్వం, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, కార్తీక్ ఎం సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|