తనీష్ సరసన మధురిమ
బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ కు ఉన్న విస్తృత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త హీరోయిన్ల తాకిడి ఇటీవల కాలంలో తెలుగులో ఎక్కువైంది. కొత్తగా పరిచయమవుతున్న పలువురు హీరోయిన్లు సైతం ఇలా వచ్చి అలా తిరుగుటపా కట్టాలని అనుకోవడం లేదు. నటనను సీరియస్ గానే తీసుకుంటున్నారు. 'ఆ ఒక్కడు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మధురిమ సైతం ఇప్పుడు టాలీవుడ్ లో తన ఉనికిని బలంగా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి చిత్రం నిర్మాణంలో ఉండగానే పబ్లిసిటీ పోస్టర్లలో మధురిమను చూసిన పలువురు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. 'ఆ ఒక్కడు' చిత్రం ఇటీవల విడుదల కావడం, గ్లామర్ తో పాటు నటనకు అవకాశమున్న పాత్రలో మధురిమ ప్రేక్షకులను అలరించడంతో తాజాగా శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'మౌనరాగం' చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. తనీష్ కు జోడిగా ఆమె ఇందులో నటించనుంది. తనీష్ ఇటీవల 'నచ్చావులే', 'రైడ్' చిత్రాలతో కథానాయకుడిగా నటించారు. గత వారంలోనే ఆయన హీరోగా నటిస్తున్న 'మౌనరాగం' చిత్రం ప్రారంభమైంది.
'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బాలాజీ దర్శకుడు. ఈ ప్రేమకథకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|