క్రిష్ 'వేదం' 12 నుంచి
తొలి చిత్రం 'గమ్యం'తో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్ కొద్ది పాటి గ్యాప్ అనంతరం 'వేదం' అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు శ్రీకారం చుడుతున్నారు. తొలుత అంతా కొత్త తారలతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినప్పటికీ ఆయన తయారు చేసిన కథాంశం నచ్చి స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ అందులో నటించేందుకు ఒప్పుకున్నారు. మరో కీలక పాత్రకు మంచు మనోజ్ ను అల్లు అర్జున్ సిఫారసు చేయడంతో మనోజ్ సైతం ఈ టీమ్ లో వచ్చిచేశారు. హీరోయిన్ పాత్రకు అనుష్కను క్రిష్ సంప్రదించినప్పుడు తొలుత ఆమె అంతగా సుముఖంగా లేనప్పటికీ అల్లు అర్జున్ సినిమాలో ఉన్నట్టు తెలియగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీస్టారర్ చిత్రాలు రావనుకుంటున్న తరుణంలో ఈ ముగ్గురు యంగ్ స్టార్స్ ను ఒకే చోట చేర్చడంతో 'వేదం' చిత్రానికి ఆదిలోనే కావాల్సినంత క్రేజ్ వచ్చిచేరింది. ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ రైట్స్ కు క్రిష్ ను పలువురు నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 12 'వేదం' చిత్రాన్ని హైద్రాబాద్ లోని సినిమాక్స్ మల్టీప్లెక్స్ లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ఏడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ తెలుస్తోంది. ఆర్కా ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది.
Be first to comment on this News / Article!
|