రాజమౌళికి దర్శకుల అండ
స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాత అడ్డాల చంటికి మధ్య తలెత్తిన వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దర్శకుల సంఘం నిర్ణయించింది. రాజమౌళికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ వివాదం పూర్వాపరాల ప్రకారం.. రాజమౌళితో 2002 ఒక చిత్రాన్ని నిర్మించేందుకు అడ్డాల చంటి ప్లాన్ చేశారు. 25 లక్షల రూపాయల రెమ్యునరేష్ లో భాగంగా 5 లక్షల రూపాయల అడ్వాన్ కూడా చెల్లించారు. అయితే అప్పట్నించీ రాజమౌళి ఆ ప్రాజెక్ట్ ను కార్యరూపంలోకి తేలేదు. దీంతో రాజమౌళి అడ్వాన్ సొమ్ముతో పాటు వడ్డీ కూడా కలిపి 25 లక్షలు రూపాయలు చెల్లించాలంటూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అడ్డాల చంటి ఫిర్యాదు చేశారు. ఇందుకు రాజమౌళి నిరాకరించడంతో ఆయనపై 'సహాయ నిరాకరణ'కు ఛాంబర్ నిర్ణయించింది. పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలు రాజమౌళికి 6 నెలలపాటు సహాయ నిరాకరణ చేయలంటూ ఛాంబర్ కోరింది. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడిపై ఛాంబర్ కన్నెర్ర చేయడం పరిశ్రమ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ల అసోసియేషన్ మంగళవారంనాడు సమావేశమై ఛాంబర్ నిర్ణయాన్ని ప్రతిఘటించేందుకు నిర్ణయించింది.
రాజమౌళికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని అసోసియేషన్ ప్రకటించింది. రాజమౌళి ఎప్పుడూ వివాదాస్పదుడు కాకపోవడం, అగ్ర దర్శకుడు కావడం కూడా ఆయనకు అనుకూలించే అంశమవుతోంది. ఈ అంశంపై రాజమౌళి కూడా ఓ ప్రకటన చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Be first to comment on this News / Article!
|