బాలకృష్ణ రక్తదానం
యువరత్న బాలకృష్ణ బుధవారంనాడు తన 50వ బర్త్ డే వేడుకను అంధ విద్యార్థుల మధ్య కొద్దిసేపు గడపడం, రక్తదానం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ద్వారా అభిమానులతో కలిసి సందడిగా జరుపుకొన్నారు. తొలుత హైద్రాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బేగంపేటలోని దేవనార్ అంధ విద్యార్థుల పాఠశాలలో కేక్ కట్ చేసి, 'రైడ్' చిత్ర యూనిట్ తో పాటు బాలబాలికల సమక్షంలో తన బర్త్ డే జరుపుకోవడం విశేషం.
దేవనార్ పాఠశాల విద్యార్థుల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందనీ, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా కార్యోన్ముఖులను చేస్తున్న పాఠాశాల నిర్వాహకులు సాయిబాబా గౌడ్ ను అభిమానించారు. నిర్మాత బెల్లంకొండ సుమారు 5 లక్షల రూపాయల సొంత నిధులను వెచ్చించి ఈ పాఠశాలకు అందజేసిన వాషింగ్ అండ్ ట్రైయర్ మిషన్ ను బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందుకు గాను బెల్లంకొండను బాలకృష్ణ అభినందిస్తూ, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహించాలనే అంశంతో ఆయన నిర్మించిన 'రైడ్ ' చిత్రం బాగుందని అన్నారు. బెల్లంకొండ సురేష్ తో పాటు, దర్శకుడు రమేష్ వర్మ, తనీష్, నాని, హీరోయిన్ అక్ష తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|