బిందుకు పూరీ 'బంపర్ ఆఫర్'
బిందు మాధవి గుర్తుంది కదా. పదహారణాల తెలుగమ్మాయి అయిన బిందు మాధవి ఈమధ్యనే శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోవడంతో బిందు నటనకు తగిన ప్రశంసలే దక్కాయి. ఆ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆఫర్ రావడంతో బిందు కెరీర్ కు సరైన బ్రేక్ దొరుకుతుందనే అంతా అనుకున్నారు. పూరీ జగన్నాథ్ తన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా ఈ చిత్రాన్ని తలబెట్టారు. అయితే పూరీ జగన్నాథ్ తనకున్న బిజీ కమిట్ మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఎట్టకేలకు పూరీ మరో చిత్రాన్ని సాయిరాంతో తీయాలని నిశ్చయించుకుని రవి అనే కొత్త దర్శకుడికి ఆ సినిమాను అప్పగించారు. ఈ చిత్రానికి పూరీ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో మళ్లీ బిందు మాధవినే పూరీ జగన్నాథ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు.
సాయిరాం శంకర్, బిందు మాధవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం గతవారమే పబ్లిసిటీకి దూరంగా ప్రారంభమైనట్టు తెలిసింది. ఈ చిత్రానికి ప్రముఖ గాయకుడు రఘు కుంచె తొలిసారి సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. చేజారిపోయిందనుకున్న సినిమా బిందు మాధవికి రావడం, పూరీ జగన్నాథ్ బ్యానర్ కావడం ఆమెకు బంపర్ ఆఫర్ గానే చెప్పాలి. అన్నట్టు...ఈ చిత్రానికి 'బంపర్ ఆఫర్' అనే టైటిల్ నే ఖరారు చేయబోతున్నారు.
Be first to comment on this News / Article!
|