'బోణి' ఆన్ లైన్ గేమ్
విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రేక్షకుల అభిరుచిలో మార్పును దృష్టిలో పెట్టుకుని పలువురు దర్శక నిర్మాతల తమ కొత్త చిత్రాలకు వినూత్న తరహాలో ప్రమోషన్ చేపడుతున్నారు. సుమంత్, కృతి జంటగా గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో రమణ గోగుల నిర్మిస్తున్న 'బోణి' చిత్రం కోసం ఇలాంటి వినూత్న ప్రచారానే చిత్ర యూనిట్ చేపట్టింది. ఈ శుక్రవారమే 'బోణి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా కంప్యూటర్ వెబ్ ఆధారిత కార్యక్రమాన్ని రూపొందించారు. సెవన్ సీస్ టెక్నాలజీస్ కు చెందిన ఆన్ లైన్ రియల్ గేమ్స్ సంస్థ ఓ సరికొత్త గేమ్ ను రూపొందించింది. అహ్లాదభరితంగా ఈ గేమ్ రూపకల్పన జరిగినట్టు రమణగోగుల బుధవారం సాయంత్రం హైద్రాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు. తెలుగు సినిమా స్క్రీన్ డాక్ టామ్ లో ఇప్పటికే కళాశాల యువతీయువకుల కోసం ఆన్ లైన్ లో పోటీలను నిర్వహిస్తున్న చెప్పారు.
'బోణి' చిత్రాన్ని పలువురు వ్యక్తులకు చూపించామనీ, అందరూ సినిమా బాగా వచ్చిందని చెప్పారనీ, ఇప్పుడు సరైన సమయంలో సినిమా విడుదల చేస్తున్నామనీ అన్నారు. యూనివర్శల్ కథాశంతో ఆందర్నీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని కృతి తెలిపింది.
Be first to comment on this News / Article!
|