మెరిట్ విద్యార్థులతో మహేష్
థమ్సప్ శీతల పానీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు హైద్రాబాద్ లో గురువారంనాడు మెరిట్ విద్యార్థులతో సందడి చేశారు. థమ్సప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 'థమ్సప్ మెరిట్ స్కాలర్ షిప్'లను మహేష్ బాబు విద్యార్థులకు ప్రదానం చేశారు. 190 మంది విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ లు అందుకున్నారు.
మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిభావంతులైన విద్యార్థులంటే తనకెంతో ఇష్టమని అన్నారు. మెరిట్ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తన వంతు కృషి తాను చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే విద్యావ్యాప్తి కోసం జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని అన్నారు. చిన్నారుల మెరుగైన భవిష్యత్ కోసం ఏదైనా చేయాలని తపన ఉందనీ, అందుకోసం ఎవరు ముందుకు వచ్చినా తన వంతు సాయం చేస్తానని అన్నారు. తాను రాజకీయాల్లో లేననీ, అయితే తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు రాజీవ్ గాంధీ అనీ మహేష్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక నుంచి తన నుంచి ఏడాదికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని నవ్వుతూ చెప్పారు.
Be first to comment on this News / Article!
|