క్రిష్ 'వేదం' ప్రారంభం
మనోజ్ మాట్లాడుతూ, క్రిష్ 'గమ్యం'లో తాను నటించాల్సి ఉందనీ, అయితే కారణాంతరాల వల్ల అది కుదరలేదనీ చెప్పారు. అల్లు అర్జున్ ఒకరోజు తనను కలిసి క్రిష్ తో మాట్లాడమని చెప్పారనీ, ఆ తర్వాత క్రిష్ స్టోరీ చెప్పడం జరిగిందన్నారు. సినిమాలో తనకు ఛాన్సిస్తే విలన్ పాత్ర చేయడానికి కూడా అభ్యంతరం లేదని ఆయనకు తాను చెప్పానని అన్నారు. స్టార్ డమ్ కోసం ఈ సినిమా చేయడం లేదనీ, నటుడిగా నిరూపించుకోవాలన్నదే తన తపన అనీ అన్నారు. అల్లు అర్జున్ తో కలసి నటిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కమర్షియల్ చిత్రంగా 'వేదం' ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి సిరివెన్నెల, ఇఎస్ మూర్తి పాటలు, వి.ఎస్.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, రాజీవ్ నాయర్ ఆర్ట్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|