'జయహే' లోగో
శివనాగ్, శ్రీరామ్, కరుణ ప్రధాన పాత్రల్లో, ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సుబ్బరాజు కీలక పాత్రలో నటించిన చిత్రం 'జయహే'. ఎస్.ఎం.ఎస్. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుధీర్ రాజు దర్శకత్వంలో మోహన్ కోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆవిష్కరించారు.
టైటిల్ లో ఓ ఉత్సాహం కనిపిస్తోందనీ, అది సినిమాలోనూ ప్రతిఫలిస్తుందని అనుకుంటున్నానని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. సినిమా పట్ల తపన ఉన్న ఉత్సాహవంతులైన యువకుల టీమ్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని అభిలభించారు. నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ, ఈ చిత్ర కథాంశం తననెంతో ఆకట్టుకుందనీ, దర్శకుడు సుధీర్ రాజు ఎంతో గట్స్ తో ఈ సినిమాన తెరకెక్కించారనీ చెప్పారు. కథను నమ్మి అందరి సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేశామని సుధీర్ రాజు తెలిపారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందిందనీ, కథకు సరిపోయే టైటిల్ కావడంతో 'జయహే' అని పేరు పెట్టామని చెప్పారు. చిన్ని చరణ్ మంచి సంగీతం అందించారనీ చెప్పారు. ఈ చిత్రం టాకీ పూర్తయిందనీ, వచ్చేవారం నుంచి పాటల చిత్రీకరణ జరుగుతుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శివాజీరాజా, బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ, జీవా, ఉత్తేజ్, సూర్య, రామరాజు, స్వాతి, రమాప్రభ, అన్నపూర్ణ తదితరుల నటించారు. ఆర్.పి.ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|